ఈ రోజు ఆషాఢ పౌర్ణమి సందర్భముగా సత్యనారాయణపురం శ్రీకాశీవిశ్వేశ్వరస్వామివారి దేవస్థానములో కొలువై ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణామ్మవారు శాకంభరీదేవి గా దర్శనమివ్వటం జరిగినది.. కూరలతో శోభాయమానముగా అలంకరించిన ఆలయప్రాంగణమును అమ్మవారి శాకంభరీ అలంకారమును తిలకించటానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.. ఉదయం 6 గంటల నుంచే అమ్మవారికి విశేష అర్చనలు ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12:00 గం ఆలయప్రాంగణములో లోకకళ్యాణార్ధం అర్చకులచే నిర్వహించబడిన చండీహోమము లో ఆలయ కార్యనిర్వహణాధికారి బి.గంగాధరరావు గారు పాల్గుని పూర్ణాహుతిని సమర్పించటం జరిగినది.. ఈ […]